కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ భజింపలేదని మదిలో నను
కేదార - ఆది
పల్లవి:
భజింపలేదని మదిలో నను
త్యజింపకే నటరాజాంతరంగిణి
॥భజింప॥
అనుపల్లవి:
అజాదిసురమౌనిజోత్తముల వలె
నిజాంతరంగముతో నీ మూర్తిని
॥భజింప॥
చరణము(లు):
హీనమగు భవకాననమున తుది
గాననగు సుజ్ఞాన మొసగు దేవీ
గానసుధాకరి భవహరి శంకరి
గానమెరిగి రాఘవుడు సుస్వరముతో
॥భజింప॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - bhajiMpalEdani madilO nanu - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )