కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ భక్తికి సమభాగ్యములేదని శివ
సామ - ఆది
పల్లవి:
భక్తికి సమభాగ్యములేదని శివ
శక్తి నారాధింపలేవా ఓ మనసా
॥భక్తికి॥
అనుపల్లవి:
భుక్తిముక్తి ప్రదాయకి యని మది నిజా
సక్తితో స్వరలయాది రక్తి దెలసి జేయు
॥భక్తికి॥
చరణము(లు):
పూని ధర్మార్థకామముల నొసగు యాగ
పూర్ణుడైతె జనన మరణము లుడుగునా
రానుపోను మాను రాజమార్గమౌ దేవీ
గానసుధాపాన విజ్ఞానముతో రాఘవుని
॥భక్తికి॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - bhaktiki samabhAgyamulEdani Siva - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )