కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ నీ పదధ్యానము గల్గిననాడే
రీతిగౌళ - ఆది
పల్లవి:
నీ పదధ్యానము గల్గిననాడే
నిత్యానందముగా గడచునమ్మ
॥నీ॥
అనుపల్లవి:
తాపత్రయముల సంతాపము జెందక
ఓ పరాత్పరీ ఓంకారీ యని
॥నీ॥
చరణము(లు):
త్రిభువన నాయకి త్రిపురాంతకి శ్రీ
త్రిపురసుందరి త్రినేత్రి పావని
మాపురేపు మనసు రంజిల్లగ
కృపామయీ శివకోమలి రాఘవునికి
॥నీ॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - nI padadhyAnamu galginanADE - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )