కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ తామసము శమింపగరాదా అంబ
అఠాణ - ఆది
పల్లవి:
తామసము శమింపగరాదా అంబ
ధర్మస్వరూపిణి దయజేసి నా
॥తామసము॥
అనుపల్లవి:
యీ మహి నీపదధ్యాన మేమరకుండు
ఇంగితముగూర్చి ఇహపరదాయకి
॥తామసము॥
చరణము(లు):
భూసురుడనై నే బుట్టి నిగమాది
పుణ్యకర్మ లెరుగనైతిని పావని
భాసురగాత్రి సద్భావముతోడను
భవభయములెల్ల హరింపవె రాఘవుని
॥తామసము॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - tAmasamu SamiMpagarAdA aMba - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )