కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ కాపాడను నీవేగద
షణ్ముఖప్రియ - రూపక
పల్లవి:
కాపాడను నీవేగద
కలిలో శివకామసుందరి నను
॥కాపాడను॥
అనుపల్లవి:
లోపాలోపముల మది నవ
లోకించుచు జాగుసేయక
॥కాపాడను॥
చరణము(లు):
ప్రణవనాదముచేత నిన్ను - బ్రస్తుతింపగా సతతము
గుణవిహీనుడనై మరి - ఘోషింపగవలసె జననీ
ఫణిపతిభూషణునికి ప్రియ - రాణివైన శ్రీరాజేశ్వరి రాఘవుని
॥కాపాడను॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - kApADanu nIvEgada - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )