కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ నాయెడ మంచితనము లేక ని
కల్యాణి - ఆది
పల్లవి:
నాయెడ మంచితనము లేక ని
న్నాడుకొనగ ఫలమా నతార్తిభంజని
॥నాయెడ॥
అనుపల్లవి:
మాయాతీత స్వరూపిణి జనని కా
మాదుల వశమై ఘడియ ఘడియకు
॥నాయెడ॥
చరణము(లు):
పరమైన గంగాస్నాన మాడితిన - వలచి సుజ్ఞానుల వచన మాలించితిన
నిరపరాధముగ నిను సేవింప - నేరని నీచుల చెలిమిని గోరి
మారవైరిమనోహరి సుకు - మారి సుందరి మహిత కల్యాణి
ఘోరపామరత్వమును బాపి నా - కోర్కెలొసగు రాఘవాఘమోచని
॥నాయెడ॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - nAyeDa maMchitanamu lEka ni - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )