కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ కలవారినమ్మి మది - కలతచెందగ నేల
ఆరభి - ఝంపె
పల్లవి:
కలవారినమ్మి మది - కలతచెందగ నేల
కామితార్థము లొసగు - కల్పవల్లివి నీవుండగ అంబ
॥కలవారి॥
అనుపల్లవి:
కలకాల మతిఘోర - కర్మబద్ధులై జగతి
కలిమి గల్గుట నీదు - కరుణఫలమని తెలియక
కలినింగిత మెరుగని - మానవు లాడెడి మా
టలువిని కరుణమాలి - కఠినోక్తులు ఘనమని
నన్నలయబలికి ఋణ - పడి భువిబ్రతికెడి సిరి
॥కలవారి॥
చరణము(లు):
నిత్యమని భ్రమసి కడు - నీచులై మురిసేరు
సత్యము గనలేక మద - మత్తులై నన్నాడేరు
నిత్యానిత్య వివేక - నేర్పరులుగాక మది
భృత్యుడగు రాఘవుని - బూని వంచనచేసెడి లోభము
॥కలవారి॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - kalavArinammi madi - kalatacheMdaga nEla - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )