కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ శ్యామలగాత్రి పరాశక్తి అంబ
జంఝూటి - ఆది
పల్లవి:
శ్యామలగాత్రి పరాశక్తి అంబ ॥శ్యామల॥
అనుపల్లవి:
వేమరు నిజభక్త వేదనల హరించు
వేల్పు నీవేగదటె వేదాతీత
॥శ్యామల॥
చరణము(లు):
భారమటే దీన - పాలినివైన త్రిశూలిని
నన్ను బ్రోవవే కపాలిని
॥శ్యామల॥
కోరితి పరశివ - కోమలి నీ సేవ
భారమనియంటినా పద్మాసని
॥శ్యామల॥
తోయజముఖి తల్లి - తోడు నీవేయని
దోసిలొగ్గు రాఘవదాసావని
॥శ్యామల॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - SyAmalagAtri parASakti aMba - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )