కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ దేవి కనకదుర్గాంబా పరశివ
రుద్రప్రియ - ఆది
పల్లవి:
దేవి కనకదుర్గాంబా పరశివ
దేహార్ధధారిణి నన్ను బ్రోవవే
॥దేవి॥
అనుపల్లవి:
వివిధాలంకారమూర్తివై
విజయవాడను విలసిల్లు మా తల్లి
॥దేవి॥
ముక్తాయి స్వరము:
. . . .
చరణము(లు):
ఆపదలకులోనై బహు
తాపము జెందిన తనయునిపై
కృపజూపి నీ పదభక్తి గూర్చి
సఫలముగా రాఘవుని సాకు
॥దేవి॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - dEvi kanakadurgAMbA paraSiva - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )