కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ నాదానందాను భవశాలికి
ఖరహరప్రియ - ఆది
పల్లవి:
నాదానందాను భవశాలికి
నానావిధ యోనిజనన బాధలుండునె మనసా
॥నాదా॥
అనుపల్లవి:
వేదవిదిత సుస్వర - విధమెరిగి నిఖిల
సాధువరులు మన - సార సేవించు ప్రణవ
॥నాదా॥
చరణము(లు):
లయశ్రుతి బద్ధమౌ - లాలిత్యముతో
నియమనిష్టలొలుకు - నిజభక్తితో
కాయజరిపుప్రియ - కాంతామణిముఖ
సోయగమును జూచి- సోఽహమ్మను
రాఘవనుత వర
॥నాదా॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - nAdAnaMdAnu bhavaSAliki - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )