కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ వే రెవ్వరమ్మ జనని నీసరి
రీతిగౌళ - ఖండజాతి త్రిపుట
పల్లవి:
వే రెవ్వరమ్మ జనని నీసరి
వేల్పు జగతిలో భవాని పావని
॥వేరె॥
అనుపల్లవి:
తీ రెరుగక సకల తీర్థముల మునిగి కడ
తేరేరా మనుజులు కామిత ఫలదాయకి
॥వేరె॥
చరణము(లు):
బాలేందు నిభానన నీ నామ ప్ర
భావ మెరుగక సద్భావ దరిద్రుడై
చాలా దుర్మోహజాలముల జిక్కి విడ
జాలని రాఘవుని బ్రోవను
॥వేరె॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - vE revvaramma janani nIsari - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )