కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ ఆదిశక్తి శంకరి న - న్నాదరింపవే ఓ జగ
హిందోళ - రూపక
పల్లవి:
ఆదిశక్తి శంకరి న - న్నాదరింపవే ఓ జగ ॥దాది॥
అనుపల్లవి:
వేదాగమవాసిని నా - విన్నపంబు లెల్ల విన
రాదా శుకపాణి దీన - రక్షకి యను బిరుదులేదా త్రిజగ
॥దాది॥
చరణము(లు):
రజతాచలమందు శివుని - రమణీయముగాను గూడి
రాజిల్లు సకలముని సు - రాదివందిత పాదవాద
గజముఖుని రీతి నన్ను - కరుణింపవె కల్పవల్లి
నిజదాసుడౌ రాఘవుని - మన్నింపను నీమదిని సదా త్రిజగ
॥దాది॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - AdiSakti SaMkari na - nnAdariMpavE O jaga - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )