కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ నేడే నిను సేవింపవలె గాని
ఆనందభైరవి - మిశ్రచాపు
పల్లవి:
నేడే నిను సేవింపవలె గాని
నిత్యముగా యీ తనువు నిలువనేర్చునే
॥నేడే॥
అనుపల్లవి:
వడిగా కామక్రోధములచే బెనగొని
కడకు కాలునిబారి కడగండ్లుబడ మేలే
॥నేడే॥
ముక్తాయి స్వరము:
. . . .
చరణము(లు):
అరిషడ్వర్గము నణచి
అన్నిట నీవై వెలిగే అంతర్భావము దెలిసి
పరమ దయానిధి నీ పదములే గతియని
దురితహారిణి రాఘవుని దుడుకుదీర
॥నేడే॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - nEDE ninu sEviMpavale gAni - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )