కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ మనసున నిన్నే గురిజేసి
భైరవి - త్రిపుట
పల్లవి:
మనసున నిన్నే గురిజేసి
మరులుకొన్నాను రావె అంబ
॥మనసున॥
అనుపల్లవి:
దీనసంరక్షకి నా
దిక్కు నీవని తెలిసి
॥మనసున॥
చరణము(లు):
త్రిపుర భైరవి నా త్రిప్పట లెల్ల దెలిసి
కృపసేయవలెగాని కోపముయేలనె
సాపరాధిని నీ సద్భక్తి గల
ప్రాపుగూర్చుటకు శివ ప్రాణనాయకి రాఘవుని
॥మనసున॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - manasuna ninnE gurijEsi - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )