కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ సదాశివనాయకీ అంబ భవజల
ఫరజు - ఆది
పల్లవి:
సదాశివనాయకీ అంబ భవజల
ధీ దాటించుట కభయదాన మొసగు
॥సదాశివ॥
అనుపల్లవి:
చిదానందము గూర్చు నీపదభక్తి
చిన్ననాడే గోరియున్నానుగా జననీ
॥సదాశివ॥
చరణము(లు):
దండివేల్పుగ నా హృత్పుండరీకమందు
నిండి తాండవించఖిలాండేశ్వరీ
చండీ కామాక్షీ బాలచంద్రనిభానన నీ
యండజేర్చి రాఘవుండనే దయతో
॥సదాశివ॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - sadASivanAyakI aMba bhavajala - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )