కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ వెఱ్ఱినమ్మికతో నీ - విఱ్ఱవీగుటె కాని తుద
సావేరి - త్రిశ్రజాతి త్రిపుట
పల్లవి:
వెఱ్ఱినమ్మికతో నీ - విఱ్ఱవీగుటె కాని తుద
కొఱ్ఱగింజైనా వెంట - గొంపోవనగునె మనసా
॥వెఱ్ఱి॥
అనుపల్లవి:
కుఱ్ఱతనయ ధన కోమలి నిజబంధు
తారుమారులరయు దాయాదులకులోనై
॥వెఱ్ఱి॥
చరణము(లు):
శమదమాది సద్గుణశాలివై నీలోని
ప్రేమరూపమౌ నిజపెన్నిధిని గనవే
వేమారు రాఘవుని పామరత్వమణచి శివ
కామినీమణిగూర్చు కైవల్య మెరుగ
॥వెఱ్ఱి॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - veRRinammikatO nI - viRRavIguTe kAni tuda - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )