కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ ఎంచి నీ నామము నామదిలో స్మ
వకుళాభరణ - ఆది
పల్లవి:
ఎంచి నీ నామము నామదిలో స్మ
రించెదనె శివ కంచికామాక్షి అంబ
॥ఎంచి॥
అనుపల్లవి:
సంచితముల హరియించి సనాతని
వంచన జేయక వరములొసగుమని
॥ఎంచి॥
చరణము(లు):
పంచబాణుని దహించిన దొర భ్రమి
యించిన నీ సొగసెంచ నా తరమె
చంచలాక్షి కరుణించ సమయమే
అంచితముగ రాఘవుడు సుస్వరముతో
॥ఎంచి॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - eMchi nI nAmamu nAmadilO sma - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )