కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ పాపమే జ్వరాది ఘోర
ధన్యాసి - చతురస్ర త్రిశ్ర ఆది (త్రిశ్రమార్గము)
పల్లవి:
పాపమే జ్వరాది ఘోర
రూపమై బాధించు మనస
॥పాపమే॥
అనుపల్లవి:
భూపతికైనా సన్మౌని
పుంగవునికైనా బహు
॥పాపమే॥
చరణము(లు):
తెలిసి తెలియ కార్జించిన - కలుషము ప్రబలినవేళల
బలిమిని పలుతాపములచే - బడలినపుడె భవహరమట
ఫలరహితముగా శివసతి - పద మాశ్రయింపుమని రాఘవునికి
॥పాపమే॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - pApamE jvarAdi ghOra - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )