కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ విడచి సుఖింపవె మనసా దు
మధ్యమావతి - రూపక
పల్లవి:
విడచి సుఖింపవె మనసా దు
ర్విషయాదులపై మోహము
॥విడచి॥
అనుపల్లవి:
అడవిచరించు మృగసమ
నడతలపై గల తమకము
॥విడచి॥
చరణము(లు):
కామ మోహ లోభముల - కలకాల మీ భవకాననమున
కామినీమణిపై ప్రేమ - కాంక్ష లుడుగనేరక మరి
సోమరివయి బహు దుర్మో - హములజిక్కి సొలసిన నిను
కామరిపు సతీమణి ఎటు - గాచును రాఘవునివలెను
॥విడచి॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - viDachi sukhiMpave manasA du - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )