కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ శైలతనయ నీ పాటి
ఫరజు - ఆది
పల్లవి:
శైలతనయ నీ పాటి
కైవల్య మొసగు వారెవరె హిమ
॥శైల॥
అనుపల్లవి:
కైలాసాధిపునికి ప్రియ
కామినీయని నిను నిష్కాములై సేవించు వారికి
॥శైల॥
చరణము(లు):
భువనము లెల్ల నీ కుక్షి నిడుకొని
సవివరముగ సాకు సనాతని
భువనేశ్వరి శుకపాణి సుహాసిని
భవనీరధిని నిర్భయముగ రాఘవునికి
॥శైల॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - Sailatanaya nI pATi - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )