కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ సుమశరహరవర సుదతీ పార్వతి
ఆభోగి - ఆది
పల్లవి:
సుమశరహరవర సుదతీ పార్వతి
సులభముగా భవజలధి దాటింపవే
॥సుమ॥
అనుపల్లవి:
కమలేక్షణ ధనదారసుతులపై
మమతవీడి నిన్నే మరిమరి వేడితి
॥సుమ॥
చరణము(లు):
ఆగమ విధియుత స్వాగతమొసగి
రాగరహితుడై రంజిల్ల పూజించి
రాగతాళస్వర రక్తిభక్తిజ్ఞాన
యోగముచే నిను వేడు రాఘవు నీవేళ
॥సుమ॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - sumaSaraharavara sudatI pArvati - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )