కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ ఈ నాడెవరితో మొరలిడుదు
తోడి - ఆది
పల్లవి:
ఈ నాడెవరితో మొరలిడుదు
ఇందుముఖి త్రిపురసుందరి యిక
॥ఈ॥
అనుపల్లవి:
ఆనాటి మొదలు నీ పదయుగ
మాశ్రయించియున్న నా శ్రమ దీర్పవు
॥ఈ॥
చరణము(లు):
కొదువలేక ఎల్లవేళల తోడై న
న్నాదుకొందువని అంతరంగమున
పదము వీడ రాఘవుని నిజభక్తి
విధమెరిగి బ్రోచు వితరణ లేకుంటే
॥ఈ॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - I nADevaritO moraliDudu - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )