కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ శంకరార్ధ శరీరిణి నీ పద
శంకరాభరణము - ఆది
పల్లవి:
శంకరార్ధ శరీరిణి నీ పద
పంకజములె మైమరచి సేవించెద శివ
॥శంకరార్ధ॥
అనుపల్లవి:
సంకటహారిణివని సదా ఘన
కంకణములు గల కామేశ్వరి అంబ
॥శంకరార్ధ॥
చరణము(లు):
శక్తి దెలిసి నీ నామాక్షరము లా
సక్తి జపించు సుభక్తుడౌ రాఘవునికి
ముక్తి ప్రదాన మొసగు పరాశక్తి
తర్కములెల్ల మాని తాతోంధిత్తోం తకధిత్తొ మ్మని
॥శంకరార్ధ॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - SaMkarArdha SarIriNi nI pada - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )