కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ పార్వతీ నిరపరాధి నేగతి
గౌళ - ఆది
పల్లవి:
పార్వతీ నిరపరాధి నేగతి
పారజూచి పరిపాలింతువో శివసతి
॥పార్వతీ॥
అనుపల్లవి:
పూర్వార్జిత కర్మాధీనుడనై భువి
పుట్టి కీలుబొమ్మకైవడి యాడితినె
॥పార్వతీ॥
ముక్తాయి స్వరము:
. . . .
చరణము(లు):
చెదరని భక్తి కుదరక కొన్నాళ్ళు
వదలని సుదతుల వలపుల కొన్నాళ్ళు
మదమత్సరముల మరిగి కొన్నాళ్ళు
తుదగతి రాఘవునికి దోచక కొన్నాళ్ళు గడచె
॥పార్వతీ॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - pArvatI niraparAdhi nEgati - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )