కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ తరుణమిదే శివ తరుణీమణి
మోహన - ఆది
పల్లవి:
తరుణమిదే శివ తరుణీమణి
తనవాడని బ్రోచుటకు నీకు మంచి
॥తరుణ॥
అనుపల్లవి:
కరుణాకరి స్మరజనక సహోదరి నీ
మరుగు జేరితి ధర్మార్థకామమోక్షదాయిని
॥తరుణ॥
చరణము(లు):
భక్తజన ఘనవిపత్తు లణచు
పరాశక్తి చాముండేశ్వరి గుహజననీ
రిక్తుని ఘోరభవాబ్ధి దాటుట క
శక్తుని వరివస్యాసక్తుని రాఘవుని బ్రోచు
॥తరుణ॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - taruNamidE Siva taruNImaNi - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )