కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ హారతి జేకొనవే అంబా జయ
సురట - ఆది
పల్లవి:
హారతి జేకొనవే అంబా జయ ॥హారతి॥
అనుపల్లవి:
మారవైరి ప్రియ - మానినీ నీదు కు
మారుడ నే అభి - మానముజూపి కర్పుర
॥హారతి॥
చరణము(లు):
నవమణిమయ సిం - హాసనమున కొలువై
నతపాలన మొన - రించు సనాతనీ
పావనమగు నీ - నామ భజన లోక
పావనమే గదా - భవహరి రాఘవుని
॥హారతి॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - hArati jEkonavE aMbA jaya - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )