కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ సద్గురుచరణ సరోరుహ భక్తి వినా
బేహాగ్‌ - ఖండజాతి త్రిపుట
పల్లవి:
సద్గురుచరణ సరోరుహ భక్తి వినా
సద్గతిగూర్చు సుసాధనము లేదన్నా
॥సద్గురు॥
అనుపల్లవి:
సద్గుణయుత శమదమాది సంపదనిడి
చిద్ఘనానంద సుధాకరుడై వెలిగే
॥సద్గురు॥
చరణము(లు):
అతులిత భవభయబాధలణచి సుజ్ఞాన
తతినిగూర్చు పరతత్వ చతురుడే
హితవుమీర నిత్యానిత్యముల బోధించి
సతతము రాఘవమానస సన్నుతుడౌ శ్రీ
॥సద్గురు॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - sadgurucharaNa sarOruha bhakti vinA - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )