కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ యోగసుఖ వియోగున కను
అఠాణ - రూపక
పల్లవి:
యోగసుఖ వియోగున కను
రాగమెటు జనించు నీపై అంబ
॥యోగ॥
అనుపల్లవి:
భోగజనిత విషయాదుల
త్యాగిగాక విరాగినని పల్కు
॥యోగ॥
చరణము(లు):
వారనిభవవారిధి దాటు
తరణివై కడతేర్తువనుచు మన
సార నీపద సారసభక్తి
గోరియున్న రాఘవుని జ్ఞాన
॥యోగ॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - yOgasukha viyOguna kanu - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )