కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ ఒంటరిగా విదేశముల కనుపక నా
వాచస్పతి - ఖండజాతి త్రిపుట
పల్లవి:
ఒంటరిగా విదేశముల కనుపక నా
వెంటరావలెనమ్మ ముక్కంటి నీబంటు
॥నొంటరిగా॥
అనుపల్లవి:
కంటిరెప్పకైవడి నాదు వెను
వెంట నిలచి దుర్ఘటసంకటముల దీర్పవలె
॥నొంటరిగా॥
చరణము(లు):
నిజదార సుతోదర పోషణ కేప్రొద్దు
నిన్ను మరచి పోనాడ కనిశము జగతిని
భజన సుగతినిడు పథమని యెంచిన తనకు
విజయములిడి ఎల్లవేళల రాఘవుని కృపజూడక
॥నొంటరిగా॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - oMTarigA vidESamula kanupaka nA - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )