కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ కులమేదైతె నేమిరా తన
మందార - ఆది
పల్లవి:
కులమేదైతె నేమిరా తన
తొల్లిజన్మార్జిత కర్మఫలజమగు
॥కుల॥
అనుపల్లవి:
జలజాసనహరిహరులను గన్న
తల్లి పరాశక్తిని దలచి ధన్యుడౌటకు
॥కుల॥
చరణము(లు):
ధర ప్రథితాత్మకమగు భరతావని
పరగు గుణకర్మభాగ వశముచే
నరుడు నాల్గువర్ణముల జనించు వి
వరమెరిగిన రాఘవ వినుతున కిక
॥కుల॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - kulamEdaite neemirA tana - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )