కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ ఎపుడైనా భిన్నమౌ దానికొరకు
ఖమాస్‌ - ఆది
పల్లవి:
ఎపుడైనా భిన్నమౌ దానికొరకు
ఇంత మమత యేటికే ఓమనసా
॥ఎపుడైనా॥
అనుపల్లవి:
ఇపుడైనా దేహిదేహ భేద మరసి
నిపుణతతో నిత్యానిత్య తత్వమెరుగక
॥ఎపుడైనా॥
చరణము(లు):
పవనాది పంచభూత విస్తృతమౌ
నవద్వారావృత దేహసౌధమున
నివసించే పరబ్రహ్మమె నిత్యమని
వివరముగాదెల్పు రాఘవుని మాటవినక
॥ఎపుడైనా॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - epuDainA bhinnamau dAnikoraku - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )