కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ కాదనేరు జననీ కలినరులు
భైరవి - ఆది
పల్లవి:
కాదనేరు జననీ కలినరులు
కార్యకారణకర్త్రివై వెలిగే నిను
॥కాదనేరు॥
అనుపల్లవి:
పాదయుగపశువులై ధర బుట్టిన
పాపమునకు సంతాపము జెందక
॥కాదనేరు॥
చరణము(లు):
నిత్యమై నిగమాంత పరతత్వమై
సత్యాఖండ సమాధినెగడు నిన్ను
కృత్యాకృత్యవివేకవిహీనులెటు
గుర్తింతురు రాఘవునితో కుతర్కించి
॥కాదనేరు॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - kAdanEru jananI kalinarulu - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )