కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ స్వరజనితోంకారనాదాఖండ పం
ఆరభి - ఖండజాతి త్రిపుట
పల్లవి:
స్వరజనితోంకారనాదాఖండ పం
జరపు చిలుక నేమరక భజింపర సప్త
॥స్వర॥
అనుపల్లవి:
అరవిందాసనహరిహరులకెల్ల మూలా
ధారమైనెగడు చిదానందమూర్తి యగు
॥స్వర॥
చరణము(లు):
విమలాత్మాగ్ని మనోనిల ప్రేరణముచే
క్రమగతి నాభీహృత్కంఠమూర్ధాస్యములయందు
కమనీయ నాదసుధాకలశముద్భూతమౌ
మర్మమెరిగి యాజన్మము రాఘవసన్నుత సు
॥స్వర॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - svarajanitO_MkAranAdAkhaMDa paM - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )