కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ ముందువారలేమైరో - మోహపాశబద్ధులైన మన
పూర్వీకల్యాణి - రూపక
పల్లవి:
ముందువారలేమైరో - మోహపాశబద్ధులైన మన ॥ముందు॥
అనుపల్లవి:
సుందరాంగులగూడి తాగి - తందనాల ప్రొద్దుబుచ్చిన॥ముందు॥
చరణము(లు):
కన్నతల్లిదండ్రులనక - అన్నదమ్ములాత్మజులనక
పున్నెకార్యముల నెరుగక - భూతలమున విఱ్ఱవీగి
చిన్ననాటనుండి ఎంతో - వన్నెలాడుల వలల జిక్కి
॥ముందు॥
పన్నగధర నిజభామిని - రాఘవనుత గుణశాలిని
సన్నిధిజేరి భజించుట - కేమరి సోమరితనమున చెడి
॥ముందు॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - muMduvAralEmairO - mOhapASabaddhulaina mana - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )