కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ విన్నానమ్మా జననీ నీకథ
మణిరంగు - ఆది
పల్లవి:
విన్నానమ్మా జననీ నీకథ
లెన్నో భక్తాపన్నరక్షణివైనటు
॥విన్నా॥
అనుపల్లవి:
అన్నపూర్ణేశ్వరి ఇలలో ఆ
కొన్నవారి కమృతాన్నమిడి బ్రోతువని
॥విన్నా॥
చరణము(లు):
పావన గంగాతీరమందు
బరగు వారణాశిపురిని వెలసిన
భావజరిపు ప్రియభామినివై భూ
భారమణచు రాఘవార్చిత భాగ్యమని
॥విన్నా॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - vinnAnammA jananI nIkatha - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )