కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ నీ భక్తవరుల కిలలో
దర్బారు - త్రిశ్రజాతి త్రిపుట
పల్లవి:
నీ భక్తవరుల కిలలో
నీచోచ్చదశ లేకముగా దోచునమ్మ
॥నీ॥
అనుపల్లవి:
శోభిల్లు శ్రీ శివకామ
సుందరి నిజతత్వాయత్త చిత్తులగు
॥నీ॥
చరణము(లు):
నిర్మలమతితో నిత్య - కర్మల కిరవైన
ధర్మనిష్టులై బరగే - సమ్మతిగల రాఘవసన్నుతులౌ
॥నీ॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - nI bhaktavarula kilalO - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )