కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ పరాశక్తి సదా భక్తార్తిభంజనివి కదా ఓ
తోడి - సంకీర్ణజాతి త్రిపుట
పల్లవి:
పరాశక్తి సదా భక్తార్తిభంజనివి కదా ఓ ॥పరాశక్తి॥
అనుపల్లవి:
నిరాదరణ జూపి నా మొర విన
నిరాకరింప తగునా
॥పరాశక్తి॥
చరణము(లు):
దురాత్ములైన మానవాధములు నీదుమహిమలు దెలియక
పరాభవించి తనకు మనుపరాని బాధలిడ జూతురు
పురాణి ధర్మ సంవర్ధనివై తేజరిల్లుచు జగతిని
జరామరణములణచి రాఘవుని బిరాన బ్రోవుము
॥పరాశక్తి॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - parASakti sadA bhaktArtibhaMjanivi kadA O - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )