కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ కాదనకే శివకామేశ్వరి భవ
రేగుప్తి - ఆది
పల్లవి:
కాదనకే శివకామేశ్వరి భవ
కాననమున నా గాసిదీర్ప వల్ల
॥గాదనకే॥
అనుపల్లవి:
ఆదుకొని భక్తాభీష్ట మొసగు నీకు
సాధుగణరిపు సంహారము చేత
॥గాదనకే॥
చరణము(లు):
ఆపనేర నీప్రాపులేక ఘోర
పాపాత్ములిడు సంతాప భారమును
ఏ పనికిల రాఘవు నంపితివో
ఆ పనిని దీర్చి ఆదరింపు మిక
॥కాదనకే॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - kAdanakE SivakAmESvari bhava - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )