కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ వేషధారుడైన నరునికిలలో వి
శంకరాభరణము - ఆది
పల్లవి:
వేషధారుడైన నరునికిలలో వి
వేక మెటుజనించు మనసా నిగమతత్వ
॥వేష॥
అనుపల్లవి:
భాషణాచతురుడై పామరులచెంత
ఆర్షేయుడనని బల్కు దేశదిమ్మరి
॥వేష॥
చరణము(లు):
వేదశాస్త్ర పురాణేతిహాసాది
విద్యాపారంగతుని కైవడి తా
సాధులక్షణాదక్షుని మాడ్కి నటించి
వాదిడి రాఘవుని వంచించు కుతంత్ర
॥వేష॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - vEShadhAruDaina narunikilalO vi - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )