కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ శక్తి జగజ్జననీ పాహీ పాహిమాం పరా
బేగడ - రూపక
పల్లవి:
శక్తి జగజ్జననీ పాహీ పాహిమాం పరా ॥శక్తి॥
అనుపల్లవి:
భక్తజనాభీష్టప్రద భాగ్యసంవర్ధని శివ ॥శక్తి॥
చరణము(లు):
సారాసారవిచార హృదయ విహారిణి
ధీరాతిధీర దనుతశూరాంతకి త్రిశూలిని
ఘోరాతిఘోర భవనీరధిజనతరణి
శ్రీరాఘవారిచయ సారసంహారిణి
॥శక్తి॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - Sakti jagajjananI pAhI pAhimAM parA - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )