కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ కామాక్షీ సదా నీ పద కం
తోడి - ఆది
పల్లవి:
కామాక్షీ సదా నీ పద కం
జములే గతియని నమ్మితినే కంచి
॥కామాక్షీ॥
అనుపల్లవి:
ఈ మానవజన్మకు సఫలమని ని
ష్కామభక్తితో నిన్నారాధించి
॥కామాక్షీ॥
చరణము(లు):
ధరాతలి యశోధనకాముడనై
పురాణి నిన్నుకోరి పూజింపనేర
జరామరణములు దీర కరుణమీర
పారజూచి నన్ను పరిపాలింపుము రాఘవనుత
॥కామాక్షీ॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - kAmAxI sadA nI pada kaM - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )