కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ చేత కాసున్నపుడే దానధర్మములు
మాయామాళవగౌళ - ఆది
పల్లవి:
చేత కాసున్నపుడే దానధర్మములు
చేసుకోరాదా మనసా చీకాకుపడక నీ
॥చేత॥
అనుపల్లవి:
నీతియుతులౌ నిగమాగమకోవిదులకు
ఖ్యాతిమీర పరమభాగవతులకు నీ
॥చేత॥
చరణము(లు):
పేదసాదలపై పెద్దమనసుజేసి
ఆదరించి సంతతాన్నదాతవై
ఈ ధర సతీసుతులపైని మోహమణచి
సాధుగతి రాఘవసన్నుత సాయుజ్యముకై
॥చేత॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - chEta kAsunnapuDE dAnadharmamulu - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )