కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ సారహృదయులై కడతేరుట కేనాటికైనా జిత సం
జనరంజని - సంకీర్ణజాతి త్రిపుట
పల్లవి:
సారహృదయులై కడతేరుట కేనాటికైనా జిత సం
సారులుగావలెరా సనాతనధర్మయుత సత్కర్మఫల
॥సార॥
అనుపల్లవి:
దారసుతధనాసక్తులై పెడదారిబట్టి పలుజన్మల కడ
తేరె తరుణోపాయమెరుగక దుర్మతులై తిరుగువారిల
॥సార॥
చరణము(లు):
ఇలలో అరుదై దొరకే యీనరజన్మమందే పోరాడి
తలపులెల్ల శివసతిపై నిలిపి పరతత్వాయత్తచిత్తులై
కులమతవర్గభేదముల గుట్టెరిగి కుతర్కములెల్లవీడి ని
ర్మల మానసులై రాఘవనుత పునరావృత్తరహిత పథము సాధించి
॥సార॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - sArahR^idayulai kaDatEruTa kEnATikainA jita saM - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )