కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ తనువే ధర్మార్థకామమోక్షము లార్జింపదగు సాధనము
గౌళ - ఖండజాతి ఆట
పల్లవి:
తనువే ధర్మార్థకామమోక్షము లార్జింపదగు సాధనము ॥తనువే॥
అనుపల్లవి:
వినవే మనసా సకలేంద్రియముల చక్కనై వెలిగే మానవ ॥తనువే॥
చరణము(లు):
నాక పితృలోక వాసులకే కాలమాశ్రయమై రాజిల్లు ॥తనువే॥
సఫల మనోరథుడౌట కెంచి యాగాది సుకర్మము లాచరించి
దేవేంద్రాది సురగణములకు హవిర్భాగములను బంచు
॥తనువే॥
అన్నసార మాధారమై భువిని రుధిరమాంసమేధస్సులచే
నభ్యున్నతిజెంది దుర్విషయాదులకు లోబడి చెడని
॥తనువే॥
సకలజీవరాసుల నరుదైదొరకు నరజన్మమిదిగాక
భరతభూమిని జనించు ప్రబలపుణ్యధనయుతమై బరగెడి
॥తనువే॥
నాదయోగజిజ్ఞాసగలిగి ప్రజ్ఞానవరగురు ప్రముఖవికాసుని
ప్రేమగొలిచి సుజ్ఞాన సులక్షణశిక్షితుడై తా
వాదతర్కముల మాని మౌనియై నాదాఖండవిభూతి
నాత్మగని రాఘవసన్నుత చిదానంద చిద్రూపముజెందు
॥తనువే॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - tanuvE dharmArthakAmamOxamu lArjiMpadagu sAdhanamu - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )