కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ ఊరక దొరకునా ఉమాపదసరసిజ మాత్మనిల్పను తన
ఆరభి - ఖండజాతి ఆట
పల్లవి:
ఊరక దొరకునా ఉమాపదసరసిజ మాత్మనిల్పను తన ॥కూరక॥
అనుపల్లవి:
పోరాడి శత్రుచయమారింటి దునిమి తలపులెల్ల శివసతిపై నిడ ॥కూరక॥
చరణము(లు):
ధరణీసురవర ధర్మమరసి యజ్ఞకర్మాదుల గల మర్మమెరుగ ॥కూరక॥
పరమభక్తజన పావని, స్మరరిపుమానిని, భవభయహారిణి,
త్రిభువనపాలిని, కమల కపాల గదా శుక శూల విలాసిని
॥ఊరక॥
ధనసుదతీమణి తనయులయెడగల తమకమున దగిలి తనపెరయని
బహుతమమున మునుగుచు పరతత్వ మహత్వమెరుగని నరున
॥కూరక॥
పరమానందసుఖ మాత్మకిడు నిజమార్గమెరుగు సమాధియుతు,
పదమాశ్రయించి, ఉమాకథ లభిమానమున విన
॥కూరక॥
రాఘవగీత స్వరములందు, శ్రుతిరాజిలుచు,
నాధారమగు నోంకారనాద, తరంగలయ, మకరంద రుచి లే
॥కూరక॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - Uraka dorakunA umApadasarasija mAtmanilpanu tana - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )