కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ సుందరి సదా నీ పదార
శుద్ధధన్యాసి - ఆది
పల్లవి:
సుందరి సదా నీ పదార
విందములకు నా వందనమే త్రిపుర
॥సుందరి॥
అనుపల్లవి:
కందర్పజనకసోదరి శర
దిందునిభానన డెందమలర పర శివ
॥సుందరి॥
చరణము(లు):
స్వాంతమున విషయభ్రాంతులుడిగి నిన్న
శ్రాంతము దలచు విశ్రాంతిగల వే
దాంతులకిడు ముక్తికాంతామణి నొసగి
కుంతలాంబ రాఘవుని కోర్కెదీర్చు
॥సుందరి॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - suMdari sadA nI padAra - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )