కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ నీ సేవకు తగు నిపుణతలేదని నాయెడ
సావేరి - మిశ్రజాతి ఝంపె
పల్లవి:
నీ సేవకు తగు నిపుణతలేదని నాయెడ
నిర్దయజూపేవా జననీ నిగమాగమ హితమౌ
॥నీ సేవకు॥
అనుపల్లవి:
దాసజనావనియని మనసారగా వన
జాసనాది సురవరులు బొగడి సేవించిన
॥నీ సేవకు॥
చరణము(లు):
కామజారి వామాంకముపై కైలాసగిరిని
ప్రేమమీర శివకామినివై వెలసిన నీ
మోముజూపి భవమోచని రాఘవునకు భువి
కామితములిడి కరుణబ్రోచు కామేశ్వరి
॥నీ సేవకు॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - nI sEvaku tagu nipuNatalEdani nAyeDa - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )