కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ శ్రీకాంత సోదరీ నన్నుబ్రోవ
ఫరజు - ఆది
పల్లవి:
శ్రీకాంత సోదరీ నన్నుబ్రోవ
చీకాకుపడెద వేకారణమొ
॥శ్రీకాంత॥
అనుపల్లవి:
ఏకాంతముగా శివునిగూడు వేళా
రాకేందుముఖి భక్తార్తీ దీర్చలేవా
॥శ్రీకాంత॥
చరణము(లు):
సంచితాగామి ప్రారబ్ధసంభవమౌ
ఎంచరాని జననమరణముల వారించె
పంచశరహరుని పడతీ నీదు బిరుదా
లించి వేడుకొను రాఘవుని శంకించి
॥శ్రీకాంత॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - SrIkAMta sOdarI nannubrOva - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )