కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ పదారవిందములే గతియని
ప్రణవప్రియ - ఆది
పల్లవి:
పదారవిందములే గతియని
సదా నమ్మితినికదా సనాతని
॥పదార॥
అనుపల్లవి:
మదాసురగణవిదారిణివైన నీ కథా
సుధారసము ధాత్రి చవిగొని
॥పదార॥
చరణము(లు):
పురాణి నాయెడ పరాకుసేయక
మొరాలించి కడు బిరాన బ్రోవను
నిరాదరణ జేసితే నాకెవరు
వరాలొసగువారు రాఘవార్చిత
॥పదార॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - padAraviMdamulE gatiyani - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )