కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ రాజరాజేశ్వరి నీపద
మోహన - ఆది
పల్లవి:
రాజరాజేశ్వరి నీపద
రాజీవములె నమ్మితినమ్మ నట
॥రాజ॥
అనుపల్లవి:
ఈ జగాన దయానిధియని పేరై
తేజరిల్లు జగదేకజనని శ్రీ
॥రాజ॥
చరణము(లు):
భావజరిపు హరి విధి సురపతులెల్ల
సేవింపగ మందహాసముతో కొలువై
ఈ వసుధ ధర్మపాలనజేయు
పావనమూర్తి భక్త రాఘవపాలిని శ్రీ
॥రాజ॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - rAjarAjESvari nIpada - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )